Header Banner

ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా!

  Sat May 03, 2025 09:05        Politics

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో రూ.647 కోట్లతో నిర్మించిన సీఎస్‌పురం నుండి సింగరాయకొండ వరకు 90 కిలోమీటర్ల జాతీయ రహదారిని జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా కందుకూరు ప్రాంతంలో రోడ్ల విస్తరణకు రూ.9.6 కోట్లు మంజూరు చేయడంతో పాటు, జిల్లాలోని పలు గ్రామీణ రోడ్ల మరమ్మతులకు రూ.25.24 కోట్లు కేటాయించారు.

 

ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. అమరావతి పనులతో పాటుగా రాష్ట్రంలోని వివిధ రైల్వే, నేషనల్ హైవేల (జాతీయ రహదారుల) అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో ప్రకాశం జిల్లాకు కీలకమైన మరో నేషనల్ హైవే కూడా ఉంది. జిల్లాలోని పశ్చిమప్రాంతమైన సీఎస్‌పురం నుంచి తూర్పుప్రాంతంలోని సింగరాయకొండ వరకు హైవేను అభివృద్ది చేశారు.. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు.

 

ఇది కూడా చదవండిఏపీకి మరో ప్రతిష్టాత్మక సంస్థ.. రూ.30 వేలకోట్ల పెట్టుబడి! ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఈ హైవేను సుమారు రూ.647 కోట్లతో 90 కిలోమీటర్లు మేర రెండు భాగాలుగా నిర్మించారు. ఈ రెండిటిలో రూ.277 కోట్లతో సీఎస్‌పురం నుంచి మాలకొండ వరకు 49 కిలోమీటర్లు రోడ్డును నిర్మించారు. అలాగే రూ.370 కోట్లతో మాలకొండ నుంచి సింగరాయకొండ వరకు 46.8 కిలోమీటర్ల రోడ్డును నిర్మించారు. మొత్తం 90 కిలోమీటర్ల హైవేలో కందుకూరు ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండగా.. దాదాపు 60శాతం మేర జిల్లా పరిధిలో ఉంది.. ఆ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు.

 


అంతేకాదు కందుకూరుకు సంబంధించి ఓవీరోడ్డు, పామూరు రోడ్డుకు మహర్దశ వచ్చింది. ఈ ప్రాంతాల్లో రోడ్లను విస్తరించేందుకు ప్రభుత్వం రూ. 9.6 కోట్లు మంజూరు చేసింది. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా రోడ్ల విస్తరణ చేపట్టారు. మొత్తం 8 కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించనున్నారు. జాతీయ రహదారి 167-బిలో భాగంగా సింగరాయకొండ నుంచి మాలకొండ వరకు 45 కి.మీ. రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో కందుకూరు పట్టణం, బడేవారిపాలెం, వలేటివారిపాలెం, చుండి ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్లు వేశారు. కందుకూరు పట్టణానికి తూర్పున సీటీఆర్‌ఐ దగ్గర బైపాస్ మొదలై పామూరు రోడ్డులోని చెర్లోపాలెం దగ్గర ప్రధాన రోడ్డులో కలుస్తుంది. ఇప్పుడు ఈ రోడ్డును 7 మీటర్ల వెడల్పు చేయడానికి రూ. 9.6 కోట్లు మంజూరయ్యాయి. త్వరలో టెండర్లు పిలిచి.. మూడు నెలల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామంటున్నారు.

 

మరోవైపు ప్రకాశం జిల్లాలో రహదారుల పునరుద్ధరణపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జిల్లాలో రోడ్ల మరమ్మతులకు సంబంధించి నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని రోడ్లకు సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. తాజాగా ఉమ్మడి జిల్లాలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోని దాదాపు 13 గ్రామీణ రోడ్ల మరమ్మతులకు నాబార్డు ఆర్‌ఐడీఎఫ్‌ నిధులు రూ.25.24 కోట్లు మంజూరు చేసింది. ఆ మేరకు పరిపాలనా అనుమతులు రాగా.. త్వరలోనే ఈ రోడ్లకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయి. ఈ రోడ్లు మరమ్మతులు పూర్తి చేస్తే తమ ఇబ్బందులు తొలగిపోతాయంటున్నారు స్థానికులు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi Another national highway in AP at a cost of Rs 647 crore